యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు ఆలయ ఉద్ఘాటన కు స్మార్త ఆగమ శాస్త్ర రీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచార పర్వాలు ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి. ఈరోజు జరగనున్న మహా క్రతువు ఉత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఘటన పర్వాలు పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల నిజస్వరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.
ఆదివారం ఉదయం శివాలయం చెంత యాగశాలలో ద్వార తోరణం, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూల మంత్రానుష్టానం, వేదః హవనం, ఆదివాసి హోమం నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు రుద్ర హవనం, ప్రసాద స్నపన, పిండికా స్థాపనం, ప్రసాది వాసం పర్వాలను శాస్త్రయుక్తంగా కొనసాగించారు. ఈ తరుణంలో నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవంలో ఈ సందర్భంగా పాల్గొననున్నారు సీఎం కేసీఆర్ దంపతులు.