రాష్ట్రంలోని ప్రముఖ ప్రసిద్ధ ఆలయం యాదగిరిగుట్ట సమీపంలో నిర్మించే రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయిలో ఆధునీకరించబోతున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహాకారంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 24.5 కోట్లతో యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. తన పోస్టులో యాదగిరిగుట్ట ఆధునీకరణ ప్లాన్ గ్రాఫిక్ వీడియోను జత చేశారు.
యాదగిరిగుట్ట ఆలయంతో పోలిన నిర్మాణంతో స్టేషన్ భవన సముదాయం మోడల్ వీడియోలో ఆకట్టుకుంటోంది. విశాలమైన రోడ్లు, గ్రీనరీ, పార్కింగ్, వసతి సదుపాయాలతో యాదగిరిగుట్ట స్టేషన్‌లో ప్రయాణికులకు, భక్తులకు అత్యున్నతమైన సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్‌ను మెరుగుపరుస్తుందని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.