కొంతమంది అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించే వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అతిగా ఆలోచించుకొని ఉన్న పనులు కూడా చేయకుండా.. సమయాన్ని వృధా చేసుకోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కన్ఫ్యూజ్ అయి అందర్నీ కన్ఫ్యూజ్ చేయడం ఇలా రకరకాలుగా ఉంటారు. అతిగా ఆలోచిస్తున్న వాళ్ళు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని భయాలు వలన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మళ్లీ మళ్లీ అదే భయాల గురించి ఆలోచించడం, అతిగా ఆలోచించడం, దారుణమైన సన్నివేశాలను ఊహించుకోవడం, నెగిటివ్ ఆలోచనలతో ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోవడం, డిప్రెషన్ ఇలా రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు.
ఎందుకు అతిగా ఆలోచిస్తారు?
దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఓవర్ థింకింగ్ వలన వారికి వారు తెలియకుండానే నష్టపోతూ ఉంటారు. ఓవర్ థింకింగ్ లక్షణాలు గురించి చూస్తే.. విశ్రాంతి లేకపోవడం, ఎక్కువగా బాధపడడం, యాంగ్జైటీ, మానసికంగా అలసిపోవడం, నెగటివ్ ఆలోచనలు, నిర్ణయాలని ప్రశ్నించుకోవడం, ఎప్పుడు ఇబ్బందిగా ఉండడం, సంఘటన, సందర్భం తప్ప మిగిలినవి ఆలోచించడం, నిర్ణయాలని ప్రశ్నించుకోవడం వంటివి ఓవర్ థింకింగ్ లక్షణాలు. దీని నుంచి బయట పడకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎలా బయటపడాలి?
ఓవర్ థింకింగ్ ద్వారా చాలామంది కొన్ని వ్యసనాలకి అలవాటు పడిపోతుంటారు కూడా. ఓవర్ థింకింగ్ వలన బంధాలు పాడైపోతాయి. శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఓవర్ థింకింగ్ నుంచి బయట పడాలంటే మనసుని పని పైకి మళ్ళించాలి. ఆలోచనలకు బ్రేక్ వేయాలి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఒకవేళ జరిగినది అయితే అది వాస్తవం అయితే జీర్ణించుకోవడం అలవాటు చేసుకోండి. మార్పులేని సంఘటనల్లో జీవించడం కంటే వాటికి స్వాగతించి దానిపై కరుణ చూపించాలి. యోగా, వ్యాయామం వంటి వాటిపై ఫోకస్ చేయండి ఇలా ఓవర్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు.