ఆ దేశంలో ‘బీర్ యోగా’కు యమ క్రేజ్..!

-

యోగాసనాలంటే చాలా మందికి శ్రద్ధ ఎక్కువ. ఆరోగ్యం ఉల్లాసంగా ఉండేందుకు.. శరీర కండరాలు ధృడంగా ఉండేందుకు వ్యాయామాలు, యోగాసనాలు చేస్తుంటారు. యోగాసనాల వల్ల శరీర ఆకృతితోపాటు ఫిట్ నెస్ ను సొంతం చేసుకోవచ్చు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు యోగా బాట పడుతుంటారు. యోగా గురువుల దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా రకాల యోగాలు అందుబాటులో ఉన్నాయి. గోట్ యోగా, డాగ్ యోగా, ఏరియల్ యోగా వంటి భిన్నమైన ఉండగా.. తాజాగా ఆ జాబితాలో మరో యోగా చేరింది. దీని పేరే బీర్ యోగా. బీర్ యోగా అంటే.. బీర్ కి యోగా కి సంబంధం ఏంటనేగా మీ సందేహం. బీర్ యోగా ఏంటో.. దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి.

beer yoga

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చాలా ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే. ఆర్థికంగా.. మానసికంగా ఎంతో డిప్రెషన్ కి లోనయ్యాం. ముఖ్యంగా యువత మానసికంగా కుంగిపోయారు. ఈ మానసిక కుంగుబాటు నుంచి యువతను బయటపడేసేందుకు, వారిలో మానసిక ఉత్తేజాన్ని నింపేందుకు బీర్ యోగాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యోగాకు యమ క్రేజ్ పెరిగిందని, ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు.

కంబోడియా రాజధాని ఫెనమ్ పెన్హ్ ప్రాంతంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో టూ బర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ తన సేవలను తిరిగి ప్రారంభించింది. కరోనా వల్ల భయపడుతున్న ప్రజలకు ఆకట్టుకునేందుకు మరింత కొత్తగా ఆలోచించి బీర్ యోగాను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంబోడియా దేశంలో ప్రారంభమైన ఈ బీర్ యోగాకు విశేష ఆదరణ పెరిగింది. ఇక్కడ బీర్ తాగడానికి వచ్చే వారు యోగాసనాలు వేస్తూ బీర్ తాగేస్తుంటారు. దీంతో మానసిక ఉల్లాసంతోపాటు ఆనందంగా అనిపిస్తుందని కస్టమర్లు చెబుతున్నారు. ఒక్కో యోగా భంగిమ వేసినప్పుడు బీర్ సిప్ వేయాలని నిర్వాహకులు చెబుతున్నారు. బీర్ యోగా ఇప్పుడు వచ్చింది కాదు. 2013లో అమెరికాలోని నెవెడాలో బర్నింగ్ మెన్ ఫెస్టివల్ లో ప్రారంభమైంది. దీని ప్రేరణతోనే బీర్ యోగాను అందుబాటులో తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version