అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన యమునా నది నీటి మట్టం

-

యమునా నది నీటి మట్టం..అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల యమునా నదికి భారీగా వచ్చి చేరుతోంది వరద నీరు. 206 మీటర్లు దాటి ప్రవహిస్తోంది యమునా నది. వరద పరిస్థితిని అంచనా వేస్తూ, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

Yamuna river, Yamuna river floods
Yamuna river water level rises in Delhi flood alert as Hathnikund barrage discharge increases

 

కాగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ అలాగే రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కులుస్తాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news