ఏపీలో ఇంకా మిగిలిన మొత్తం 432 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 432 ఓపెన్ కేటగిరీ బార్లు మరియు 4 రిజర్వ్ కేటగిరీ బార్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 15 ఉదయం 8 గంటలకు లక్కీడ్రా నిర్వహిస్తారు. ఏపీలో బార్లను తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్స్ బంద్ కానున్నాయి. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు మద్యం దుకాణదారులకు ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్ అధికారులు. ఈ నెల 6న ఉదయం 6 గం. నుంచి 7న సాయంత్రం 6 గం. దాకా వైన్ షాప్స్ మూసివేయనున్నారు.