ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే : యనమల

-

ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ ఆర్థికమంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కాగ్ చెప్పిందని యనమల వెల్లడించారు. ఆదాయం, వ్యయం, అప్పు, అభివృద్ధిపై ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు ఆయన. ఏపీలో మూలధన వ్యయం 9.21 శాతానికి తగ్గిందని చెప్పారు. రెవెన్యూ రాబడి 28.53 శాతం పెరిగినా, సంక్షేమంపై ఖర్చు అంతంత మాత్రమేనని వివరించారు. కొత్త అప్పుల్లో 80 శాతం పాత అప్పులు తీర్చేందుకే సరిపోతుందని యనమల వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్‌ నివేదికను కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్-కాగ్‌ సమర్పించింది. 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికను అందజేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రెవెన్యూ, రవాణా అంశాలపై నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన రూ.6,356 కోట్ల రూపాయల గ్రాంట్ మురిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు రూ.24,257 కోట్ల మేర పెరిగాయని కాగ్‌ పేర్కొంది. చట్టం నిర్దేశించిన పరిమితి కంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు 9.85 శాతం ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ ఖర్చులు 4.25 శాతం మేర పెరిగాయి.

 

సామాజిక-ఆర్ధికాభివృద్ధి పథకాల కోసం అప్పులపై ఆధారపడకుండా అదనపు రెవెన్యూ వనరుల కోసం ప్రయత్నించాలని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఆస్తుల కల్పన-ఆర్ధికాభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచాలి. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని కాగ్ నివేదిక పేర్కొంది. ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండానే 2 వేల812 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆర్ధిక సంఘం గ్రాంట్లను పంచాయితీల విద్యుత్ బకాయిల పేరుతో రూ. 1351 కోట్ల రూపాయలు మినహాయించారు. స్థానిక సంస్థలకు చెందిన నిధుల్లో ఆర్ధికశాఖ కోత విధించటం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉంది. రాష్ట్రంలో 17 ప్రభుత్వ రంగ సంస్థలు 3,387 కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయంటూ కాగ్ స్పష్టం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version