జగన్‌ రాజ్యాంగాన్ని లెక్కచేయడంలేదు : యనమల

-

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మరోసారి ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని, ట్రెజరీ కోడ్‌ ఉల్లంఘించి అనుచరులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఏపీ సర్కారుపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. దేశం మొత్తమ్మీద అత్యధిక చేబదుళ్లు తీసుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. మద్యంపై బాండ్లు, ఏపీఎస్డీసీ ద్వారా అప్పులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్ధమని తెలిపారు. ఎఫ్ఆర్ బీఎం నిబంధనలను సీఎం జగన్ పట్టించుకోవడంలేదని, రాజ్యాంగాన్ని లెక్కచేయడంలేదని అన్నారు.

ఏపీ సర్కారుకు కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని తెలిపారు. వేజ్ అండ్ మీన్స్ తో రూ.1.04 లక్షల కోట్ల నిధులు, ఓడీ కింద రూ.31 వేల కోట్ల నిధులు తెచ్చారని, ఆ నిధులకు లెక్కలు చెప్పడంలేదని ఆరోపించారు. ట్రెజరీ కోడ్ ను ఉల్లంఘించి ప్రత్యేక బిల్లుల రూపంలో తనకు కావాల్సిన వారికోసం రూ.48,284.32 కోట్లు దోచిపెట్టారని యనమల వెల్లడించారు. దీన్ని కప్పిపుచ్చేందుకు జీవో-80 తీసుకువచ్చారని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ ను బైపాస్ చేస్తూ బిల్లులు చెల్లిస్తున్నారని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version