వైసీపీ స్వతంత్రంగా పోటీ చేసే పార్టీ.. ఎవరితో పొత్తు లేదు : మంత్రి అంబటి రాంబాబు

-

బీజేపీతో మాకు తెరవెనక సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ అవాస్తవం అని ఎవరికీ సపోర్ట్‌ చేయాల్సిన అవసరం మాకు లేదు అని అంబటి రాంబాబు అన్నారు.వైసీపీ స్వతంత్రంగా పోటీ చేసే పార్టీ.. ఎవరితో పొత్తు లేదు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుతాం అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.. ఇక, పేద బడుగు బలహీన వర్గాల బలంతోనే వైసీపీ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీలకు వైసీపీ కొమ్ము కాయదు అని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇక, ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ వైసీపీ-బీజేపీ సంబంధాలపై మంత్రి అంబటి రాంబాబు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో అన్ని విధాలుగా సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఖరారైన తర్వాత.. ఆ పొత్తు అనైతికమైనది అంటూ అంబటి రాంబాబు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news