వైసీపీకి బిగ్ షాక్‌.. పార్టీలో కీల‌క నేత రాజీనామా..

-

ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ముద్దన తిరుపతి నాయుడు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉండి డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆశించిన ముద్దన, ఆ పదవిని వేరే వాళ్లకు ఇవ్వడంతో అసంతృప్తికి లోన‌ట్టు తెలుస్తోంది.

అలాగే పార్టీలో తనకు సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కడం లేదని గత కొంతకాలంగా తన అనుచరుల ముందు వ్యాఖ్యానిస్తున్న ఆయన, ఇప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించిన ముద్దన, తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news