‘వెంటాడి, వేటాడి చంపుతానంటున్న బాలయ్య’…. అదరగొట్టిన ‘రూలర్’ ట్రైలర్…..!!

-

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా రూలర్. గత ఏడాది వచ్చిన  జైసింహా ద్వారా మంచి హిట్ అందుకున్న బాలయ్య, మరొక్కసారి అదే దర్శకుడికి అవకాశం ఇచ్చారు. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. సీనియర్ నటి జయసుధ మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే నేడు ఉదయం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. బాలకృష్ణ రెండు రకాల వేరియేషన్స్ లో ఈ ట్రైలర్ లో కనపడ్డారు. ఒకటి పవర్ఫుల్ డాన్ పాత్ర అయితే, మరొకటి మాస్ పోలీస్ పాత్ర. రెండు పాత్రల్లోనూ ట్రైలర్ లో అదరగొట్టే పెర్ఫార్మన్స్ చూపిన బాలకృష్ణ, మంచి అదిరిపోయే డైలాగ్స్ కూడా చెప్పారు. ‘ఎవరికి రా ఫోన్ చేస్తున్నావ్ ఫైర్ ఇంజన్ కా అని విలన్ అనగానే, కాదు ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక వ్యక్తి చె ప్పే డైలాగ్ తో హెలికాఫ్టర్ లో నుండి బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది.

‘పార్సిల్ చేయడానికి ఇది దెబ్బ తిన్న సింహం రా అంత తేలిగ్గా చావదు, వెంటాడి వేటాడి చంపుద్ధి’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ టీజర్ కు మెయిన్ హైలైట్. ఇక ఈ టీజర్ లో ఫైట్స్, యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఇది ఒక మంచి పవర్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు రవికుమార్ ఈ సినిమాను తీశారట. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అద్భుతంగా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమా ఈనెల 20వ తేదీన రిలీజ్ అవుతోంది……!!

Read more RELATED
Recommended to you

Latest news