అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా ఎంత బలమైన పార్టీ అయినా సరే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ నాయకుడు అయినా సరే ప్రజలనే కాదు ప్రత్యర్ధిని కూడా గౌరవిస్తూ ఉండాలి. అధినేతను, ముఖ్యమంత్రిని మెప్పిస్తూ ఉండాలి. రాజకీయంలో నువ్వు ఎన్ని విధాలుగా అయినా విమర్శలు చేయవచ్చు. కాని కొన్ని కొన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నోటి మాట నుంచి ప్రతీ ఒక్కటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి ఇప్పుడు ఇవే పెను ప్రమాదం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నోటి దురుసు ఇబ్బంది పెడుతుంది. జగన్ మెప్పు కోసం ఆమె చేసే విమర్శలు చివరికి జగన్ నే ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాస్తవం. ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మగతనం మీద చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.
దీనిపై సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా ఇదే విధంగా ఉన్నారు. ఆయన యువకుడు కాబట్టి బ్లడ్ లో దూకుడు ఉంటుంది కాబట్టి కోపం సహజం, అది ఎమ్మెల్యే వరకు ఓకే కాని మంత్రి అయిన తర్వాత మాత్రం చాలా ఓపిక అవసరం. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంగా ఉంటూ అతి కోపం ప్రదర్శిస్తూ జగన్ నే ఇబ్బంది పెట్టే వరకు వెళ్ళారు మంత్రిగారు.
ఇకపోతే… బొత్సా సత్యనారాయణ. పురపాలక శాఖా మంత్రిగా ఉన్న ఈయన గారి మాటలు ఇప్పుడు అర్ధం కావడం లేదనే ఆరోపణ ఉంది. ఇక ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు క్రమంగా పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్డియే విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యకు పార్టీ మొత్తం వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలా కొందరు మాట్లాడుతున్న మాటలు చివరికి జగన్ నెత్తిన పడుతున్నాయి.