ప్రస్తుతం ఉన్న తెలుగు రాజకీయ నాయకులలో బొత్స సత్యనారాయణ చాలా సీనియర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించారు. అంతేకాకుండా వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పని చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన బొత్స సత్యనారాయణ వైసిపి పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం జగన్ ఆధ్వర్యంలో మంత్రిగా వ్యవహరిస్తున్న బొత్స ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలను మీడియా ముందు చెప్పే నేతగా కూడా రాణిస్తున్నారు. అయితే మీడియా సమావేశాలలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు చాలా అడ్వాంటేజ్ గా మరియు ప్రభుత్వంపైనే విమర్శలు చేసే అస్త్రాలుగా మారుతున్నాయి.
విషయంలోకి వెళితే ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు ని విశాఖ విమానాశ్రయం బయట విశాఖ వాసులు అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ…చంద్రబాబు వ్యవహరించిన తీరు చాలా దారుణం అని అన్నారు. అక్కడిదాకా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత పెళ్లికి వెళుతూ వెళుతూ కావాలని చంద్రబాబు రెచ్చగొట్టే చర్య చేశారని ఆరోపించారు. దీంతో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ కార్యకర్తలు నేతలు తాజాగా మండిపడుతున్నారట. ఎవరైనా బొత్స సత్యనారాయణ మాటలు వింటే .. నిజంగా చంద్రబాబు మీద సానుభూతి కలుగుతుంది అని అంటున్నారట.
చంద్రబాబునాయుడు విశాఖ వచ్చింది కేవలం పెళ్లికి వెళ్లడానికి కాదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మక దుష్ప్రచారాన్ని కొనసాగించడానికి ఆయన విశాఖ వచ్చేరనేది అందరికీ తెలిసిన సంగతి. అయితే అసలు విషయాన్ని పక్కన పెట్టి ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ కలిగే విధంగా మాట్లాడటంతో సొంత పార్టీ నేతలే తల పట్టుకుంటున్నారట. అంతేకాకుండా దయచేసి మీడియా ముందు మాట్లాడవద్దు డియర్ బొత్స సత్యనారాయణ గారు అంటూ వైకాపా జనాలు విజ్ఞప్తి చేస్తున్నారు.