బాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటి బయటొస్తున్నాయి: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

-

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో ఇరుక్కుని రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషియాయంపైనా రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు గతంలో చేసిన ఒక్కో స్కాం మెల్ల మెల్లగా బయటకు వస్తున్నాయి అంటూ విమర్శించారు. ఇంతకాలం చంద్రబాబును నెత్తిమీద పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలు అందరూ భంగపడేలా ఈయన ఇలాంటి అవినీతికి పాల్పడ్డారని శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్ చేశాడు. ఇప్పుడిప్పుడే చంద్రబాబు స్వరూపం తెలియని వారంతా తెలుసుకుంటున్నారు అంటూ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. శాసనసభ సాక్షిగా ప్రజలు అందరికీ తెలిసేలా ఈ స్కిల్ స్కాం గురించి చెప్పాము అంటూ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. కాగా రిమాండ్ కు వెళ్లి మూడు వారాలు అవుతున్నా ఇంకా బెయిల్ దక్కని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 3 వరకు కూడా జైల్లోనే ఉండే పరిస్థితి ఉందని లాయర్లు అంటున్నారు. ఆ తర్వాత సుప్రీమ్ కోర్ట్ లో విచారణ జరిగిన ఏమైనా పాజిటివ్ గా వస్తే చెప్పలేము.

Read more RELATED
Recommended to you

Latest news