చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయనకి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకంటే ముందు ఎమ్మెల్యే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు బలిజ కలుస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి గిట్టదని అన్నారు. రెడ్డి కుల నేతలు వైసీపీని ఏడాది క్రితం వదిలేసారు సస్పెండ్ చేయలేదని కానీ తనని మాత్రం వెంటనే సస్పెండ్ చేశారని అన్నారు.
కేవలం బలిజ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు వైసిపికి బలిజలు అంటే పడదని. బలిజలు వైసీపీకి ఓటు వేయరని జగన్ మోహన్ రెడ్డి భావన అని అన్నారు. ఆరు జిల్లాల్లో 74 స్థానాలు ఉంటే 2019లో బలిజ వర్గానికి రెండు స్థానాలు కేటాయించారని చెప్పారు. 2024 ఎన్నికల్లో స్థానం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు బలిజలు అంటే ఎందుకు అంత వివక్ష అని అడిగారు. తిరుపతిలో పోటీ చేసే అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టమని పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకే అడుగులు వేస్తామని అన్నారు.