సజ్జల గురించి మళ్లీ మాట్లాడుతున్నా.. వింటున్నారా.. తగ్గేదేలే : కోటంరెడ్డి

-

తనపై వైసీపీ ముఖ్యనాయకులు ఆరోపణలు, విమర్శలు చేయడం.. కొంతమంది బెదిరింపులకు పాల్పడటంపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. అధికారాన్ని వదులుకొని మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్దామనుకున్నానని.. కానీ తన వ్యక్తిత్వాన్ని శంకించే రీతిలో మాట్లాడుతుంటే స్పందిస్తున్నానని స్పష్టం చేశారు. కష్టాల్లో నడిచానని.. ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానని చెప్పారు.

‘నాకు బెదిరింపు కాల్స్‌ వచ్చినా భయపడట్లేదు. బెదిరింపు కాల్స్‌ వస్తే నేనేమీ భయపడకుండా అంతా వింటున్నా. రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడా.. నేను భయపడలేదే. నన్ను, నా తమ్ముడిని కోట్టేసుకుంటూ తీసుకెళ్తానన్నారు. సజ్జల కోటరీ నుంచి మాట్లాడారని తెలిసింది. నీ మాటలకు వణికేవాళ్లం కాదు బోరుగడ్డ అనిల్‌. అనిల్‌తో మాట్లాడించిన సజ్జలకు చెబుతున్నా.. నెల్లూరు రూరల్‌ నుంచి నేరుగా వీడియో కాల్స్‌ వస్తాయి గుర్తుంచుకో. సజ్జల గురించి మళ్లీ మాట్లాడుతున్నా… వింటున్నారా బోరుగడ్డ అనిల్‌.
ఇలాంటి వందమందిని పంపించినా భయపడేది లేదని సజ్జలకు చెబుతున్నా. నాపై కేసు పెట్టడమే కాకుండా తొడకొట్టి సవాల్‌ చేశారు. తొడకొట్టి సవాల్‌ చేసిన భాస్కర్‌కు చెబుతున్నా.. నేను ఎవరికీ భయపడను.’ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version