రూ.200 తో నెలకు రూ.50,000 పెన్షన్..!

-

చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు. పొదుపు చేయడానికి అనేక పొదుపు పథకాలు వున్నాయి. కొన్ని పొదుపు పథకాలు అయితే మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఆ స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఒకటి. దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. ఇక పూర్తి వివరాలని చూస్తే..

ఇది సామాజిక భద్రతా పెట్టుబడి పథకం. ఈ స్కీమ్ డబ్బులు కొంత డెట్‌లోకి, ఇంకొంత ఈక్విటీలోకి వెళ్తాయి. రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి 75:25, 50:50, 40:60 చొప్పున డెట్, ఈక్విటీ ని మనం ఎంపిక చేసుకోవచ్చు. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి రిటర్న్స్ ఉంటాయి గుర్తు పెట్టుకోండి.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (1B) ప్రకారం ఏడాదికి రూ.50,000 మినహాయింపు కూడా మనం పొందొచ్చు. అలానే 80CCD (1C) ప్రకారం ఏడాదికి రూ.50,000 అదనంగా మినహాయింపు పొందొచ్చు. 25 ఏళ్ల వయస్సు వాళ్ళు పొదుపు చేస్తే రిటైర్మెంట్ సమయానికి మంచి రిటర్న్స్ పొందొచ్చు.

ప్రతీ రోజూ రూ.200 చొప్పున నెలకు రూ.6,000 60 ఏళ్ల దాకా పొదుపు చేస్తే.. సుమారు రూ.50 లక్షలు వస్తాయి. ఒకవేళ మీరు ప్రతీ నెలా పెన్షన్ కావాలనుకుంటే రూ.50 లక్షలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. వడ్డీ 8 శాతం చొప్పున చూస్తే నెలకు రూ.50,000 ప్రతీ నెలా అకౌంట్‌లోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version