ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పద నాయకుడిగా మారిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి… తాజాగా రెబల్‌గా మారేం దుకు సిద్ధమయ్యారా? పార్టీలోనే అసమ్మతి నాయకుడిగా ఎదగాలని ఆయన బావిస్తున్నారా? తాజా పరిణా మాలు ఏం చెబుతున్నాయి? ఏం జరుగుతోంది? నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సా ధించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీలో మంచి గళం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అదేసమయం లో ఆయన ఫైర్ బ్రాండ్‌గా కూడా ముద్ర వేసుకున్నారు. అయితే, ఈ క్రమంలోనే ఆయన దూకుడు పెంచి వివాదాలను కొని తెచ్చుకున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగుల్లో తల దూర్చారు.
ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత దూకుడు పెంచి.. ప్రతిపక్ష నేత చంద్రబాబును అసెంబ్లీలోనే తీ వ్ర వ్యాఖ్యలతో ఇరుకునపెట్టారు. దీంతో జగన్ దగ్గర మంచి మార్కులు పడ్డాయి. ఇక, ఈ అదునుతో కోటంరెడ్డి తన విశ్వరూపం చూపించేందుకు రెడీ అయ్యారు. స్థానిక పత్రిక ఒకటి తనపై వ్యతిరేక వార్తలు రాసిందనే అక్కసుతో నేరుగా ఆ పత్రిక ఎడిటర్ ఇంటికి వెళ్లి.. ఆయనను బెదిరించడం, కొట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక, ఇటీవల ఓ మహిళా ఎంపీడీవోను బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో రాజకీయంగా దూకుడుప్రదర్శించినా.. వివాదాలతో సెంటర్ ఆఫ్ టాక్ అయ్యారు.
ఇక, తనను డిఫేమ్ చేయడం వెనుక స్థానికంగా సర్వపల్లి ఎమ్మెల్యే హస్తం ఉందని భావిస్తున్న కోటంరెడ్డి.. ఇప్పుడు నేరుగా ఆయనపైనే యుద్ధం ప్రకటించారని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన ఇసుక అంశంలో వేలు పెట్టేందుకు కోటంరెడ్డి రెడీ అయ్యారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్న కోటంరెడ్డి.. ఈయనను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఇసుక మాఫియాపై పోరాటానికి దిగుతానని ప్రకటించడం పార్టీని ఇబ్బందిలోకి నెట్టిందని అంటున్నారు పరిశీలకులు.
ఇసుక మాఫియా అంతు చూస్తానంటూ.. శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌లో రెండు నిమిషాలకే నో స్టాక్ బోర్డు వస్తోందని… నెల్లూరులోని ఓ రీచ్ నుంచి ఎమ్మెల్యేల పేరుతో ఇసుక తరలిస్తున్నారని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకూ ఇసుక దొరికేలా అధికారులు చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తానని ప్రకటించారు. కోటంరెడ్డి చెప్పిన పొట్టిపాళెం ఇసుక రీచ్ .. సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లో ఉంది. ఇప్పుడు ఈవి షయంలో కోటంరెడ్డి దూకుడు చూస్తుంటే.. కాకాణిని ఇరుకున పెట్టడం ఏమో కానీ.. పార్టీని మాత్రం ఇరుకున పెట్టినట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన రెబల్గా మారుతున్నారా? అనే డౌట్లు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.