తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ నీటి దొంగ అయితే.. సీఎం జగన్ గజ దొంగ అయ్యిండని ఫైర్ అయ్యారు. ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఆపక పోతే ప్రజా యుద్ధమేనని…లంకలో ఉండేవాళ్లంతా రాక్షసులేనని మండిపడ్డారు. అయితే.. మంత్రి వేముల ప్రశాంత రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా. ఒక మంత్రి అయి ఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చురకలు అంటించారు. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం ప్రశాంత రెడ్డి తెలుసుకోవాలని మండిపడ్డారు.
ప్రజల మనుసుల్లో విషం చిమ్మే ప్రయత్నం చేయటం మంచిది కాదని ఫైర్ అయ్యారు రోజా. అలాగే సీతానగరం ఘటన పై ఎమ్యెల్యే రోజా స్పందించారు. టీడీపీ హయాంలో ఎంతో మంది అమ్మాయిల పై అత్యాచార ఘటనలు జరిగా యన్నారు. రాజకీయ ఒత్తిడిలతో ఒక్కరికి కూడా శిక్ష వేసే ప్రయత్నం చేయలేదని.. సీతానగరం ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక ఘటనతో టీడీపీ నేతలు విమర్శలకు దిగటం విడ్డూరమని ఫైర్ అయ్యారు.