ఆర్ ఆర్ ఆర్‌ లో 8నిముషాల స్పెష‌ల్‌సాంగ్.. ఆ మాత్రం ఉండాల్సిందే!

-

ద‌ర్శ‌క ధీరుడు తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై ఉన్న అంచ‌నాలు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా మోస్ట్ వెయిటెడ్ మూవీగా తెర‌కెక్కుతోంది. ఇందులో ఇద్ద‌రు స్టార్లు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తుండ‌టంతో అంచానాలు పీక్స్‌లో ఉన్నాయి. అయ‌తే కొవిడ్ కార‌ణంగా ప్ర‌స్తుతం షూటింగ్ నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. కాగా ఇప్పుడు మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు.

కాగా సోమవారం నుంచి హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో కొత్త షెడ్యూల్ ను జ‌క్క‌న్న ప్లాన్ చేశారు. ఫ‌స్టు రోజు హీరో రామ్ చరణ్ మీద జ‌రిగింది. ఇక ఈరోజు యంగ్ టైగ‌ర్ తారక్ జాయిన్ అవుతారని స‌మాచారం. అయితే ఈ పాట‌ను ప్ర‌త్యేకంగా జాగ్ర‌త్తలు తీసుకుని మ‌రీ తెర‌కెక్కిస్తున్నారు.

వారం రోజుల‌కు పైగా సాంగ్ షెడ్యూల్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. కాగా ఈ మూవీలో రెండు పాటలను ఈ షెడ్యూల్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై రాజ‌మౌళి ఓ స్పెషల్ సాంగ్ ను చేస్తున్నారు. ఇప్ప‌టికే దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 25 నుంచి 30 రోజుల వ‌ర‌కు షూట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ 8 నిమిషాల వ‌ర‌కు ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version