చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని హవాలా ఆపరేటర్లు అందరూ చంద్రబాబు గారి కనుసన్నల్లోనే పని చేస్తారు వాళ్లు ఎవరైనా డబ్బుతో దొరికితే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడితో విడిపిస్తాడు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి 118 కోట్లు కమీషన్ గా తీసుకున్నట్టు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులో షెల్ కంపెనీల ప్రతినిధులుగా పేర్కొన్న పేర్లన్నీ హవాలా ఆపరేటర్లవే అని వెల్లడించారు విజయ్ సాయిరెడ్డి.
చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేసింది తక్కువే అన్నారు. తాను అభివృద్ధి చేయడు.. చేసే వారిని చేయనియ్యడు అని పేర్కొన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు ముందుంటారని, దీనికి తోడు ఎల్లో మీడియా కవర్ చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఎంతో అభివృద్ధి పనులను చేపడుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేక విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు త్వరలోనే తగిన శాస్త్రీ జరుగుతుందని తెలిపారు విజయ సాయిరెడ్డి.