గ్రేటర్ పోరు :వైసీపీ కీలక ప్రకటన

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక ప్రకటన చేసింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కు సంబంధించిన అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు గమనించాలని పేర్కొంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఏపీలో ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ మేయర్ పీఠం మాత్రం టిఆర్ఎస్ దే అని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ పార్టీకి ఎక్స్ అఫిషియో సభ్యుల బలం గట్టిగా ఉండడంతో మేయర్ పీఠం ఆ పార్టీదేనని అంటున్నారు.