కేంద్రంలోని మోడీ సర్కార్ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పందించారు. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు. అదే విధంగా పసుపుకు మద్దతు ధర కల్పించడంతో పాటు మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు సైతం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తూ బోర్డుకు ప్రత్యేక నిధి కేటాయించాలని సూచించారు. అంతేకాకుండా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకొని నిజామాబాద్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని కోరారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన పల్లె గంగారెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.