తెలంగాణలో ఎన్నికల ప్రచారం మరో మూడు రోజల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఈ సందర్భంగా నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ని రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు పలు సభల్లో పాల్గొని తెరాస, ప్రజా కూటమిలపై ధ్వజమెత్తారు. దీంతో నేటి యోగీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనుంది. భాజపా – తెరాస మిత్ర బంధం కొనసాగతోంది అంటున్న ప్రతిపక్షాలకు యోదీ ఆదిత్య నాథ్ సభతో మరింత క్లారిటీ రానుంది.
యోగి పర్యటన షెడ్యూల్:
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు యోగీ వికారాబాద్ చేరుకుని, తాండూర్ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో,5 గంటలకు గోషామహాల్‌లో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆదివారం ఒకే రోజు యోగీతో పాటు అమిత్ షా, గడ్కారీలు కూడా పర్యటించనున్న నేపథ్యంలో తెలంగాణలో ఎటు చూసిన ఎన్నికల కోలాహాలం కనబడుతోంది.