మీరు ఏమైనా వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి ఐడియా. కేవలం రోజుకి రెండు, మూడు గంటలు కష్టపడితే చాలు. ఈ రోజుల్లో యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు. దీని వలన బాగా సంపాదించవచ్చు. అదే గుడ్ల వ్యాపారం. ఈ వ్యాపారాన్ని చులకనగా చూడకండి. అన్ని సీజన్స్ లో బాగా అమ్ముడైపోతాయి. పైగా కోడిగుడ్లను అందరూ వినియోగిస్తారు.
అయితే మీరు దీని కోసం ఎం చెయ్యాలి అనేది చూద్దాం..! హోల్ సేల్ డీలర్ల వద్ద కోడిగుడ్లను కొనుగోలు చేసి, వాటిని కిరాణా షాపులు, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ కు సప్లై చెయ్యాలి. ఇలా ఈ ఎగ్ సప్లయర్ వ్యాపారం తో మంచి రాబడి మీకు వస్తుంది. ఈ బిజినెస్ ని ప్రారంభించే ముందు ఎం కావాలో చూద్దాం. దీనికి మీకు 10X10 గది అవసరం.
అలానే ఒక మినీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ సప్లై చెయ్యడానికి అవసరం పడుతుంది. ఫారంగేట్ వద్ద ఒక కోడిగుడ్డు ధర రూ.4 వుంది అంటే మీరు ఒక్కో ఎగ్ ధర రూ. 5 వరకూ అమ్మవచ్చు. ఒక ట్రే కోడి గుడ్లు మార్కెట్ రేట్ లో రూ.150 పలుకుతుంది. అంటే ఒక ట్రే మీద మనకు రూ.30 లాభం వస్తుంది.
ఇలా మీకు ఒక ట్రే కి రూ.30 లాభంలో హోల్ సేలర్ వాటా రూ.14, సప్లయర్ వాటా రూ.6, రిటైల్ అమ్మకం దారు వాటా రూ.10 ఎలా చూసిన మీకు ఒక ట్రే మీద రూ.6 లాభం వస్తుంది. ఒక ఏరియా లో మీరు ఎలా లేదన్న 100 ట్రేలను సప్లయ్ చేస్తే రూ.600 లాభం వస్తుంది. ఇలా రోజుకి 2 నుంచి 3 గంటలు కష్టపడితే చాలు. దానితో పాటు మీరు అదనంగా ఏమైనా రెస్టారెంట్స్, హోటల్స్, హాస్టల్స్ లాంటి చోట సప్లై చేస్తే నెలకి రూ.50 వేలు దాకా పొందవచ్చు.