జ్ఞాపక శక్తిని పెంచడంలో బాదం పాలు బాగా పని చేస్తాయి…!

-

సాధారణంగా మనం బాదంని నానబెట్టుకుని తింటాము. దాని వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనకి తెలుసు. అయితే బాదం పాలు తాగడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఇప్పుడు చూద్దాం. బాదం పాలు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పు నానబెట్టి తొక్క తీసి మెత్తగా రుబ్బి నీళ్లు పోసి పాలల్ల చిక్కగా కనబడే వరకు కలపాలి. ఇలా చేసిన దానిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఎముకల గట్టితనానికి:

ఎముకల గట్టిపడడానికి బాదం పాలు మేలు చేస్తాయి. ఆవు పాల కంటే బాదం పాల లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ సమస్యలు కూడా రావు.

రక్త హీనతను నివారిస్తుంది:

బాదం పాలు తీసుకోవడం వల్ల రక్తం లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చు. అలానే ఇది రక్తహీనతను కూడా పోగొడుతుంది.

లైంగిక సామర్ధ్యం పెంచుతుంది:

బాదం తీసుకోవడం వల్ల సెక్స్ హార్మోన్లను విడుదల చేసేలా ఉపయోగపడుతుంది. అలానే ఇది మహిళల్లో కోరికలు పెంచడానికి కూడా ఉపయోగ పడుతుంది అని నిపుణులు అంటున్నారు.

జ్ఞాపక శక్తిని పెంచుతుంది:

బాదం పాలు తాగడం వల్ల మెమరీ పవర్ ను కూడా పెంచుకోవచ్చు. మెదడుకి కావాల్సిన శక్తి బాదం పాలు ద్వారా చేరుతుంది. కాబట్టి పడుకునే ముందు ఒక గ్లాసు బాదం పాలు తాగండి. దీనితో మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

దీనిలో సోడియం తక్కువగా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్ కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలానే గుండె సమస్యల్ని తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news