పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ తో ఈ లాభాల్ని పొందొచ్చు..!

-

డిజిటల్​ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. రోజువారీ లావాదేవీలను ఈజీగా మార్చడానికి సరికొత్త కార్డును ప్రారంభించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..యూజర్ల కోసం సరికొత్త ట్రాన్సిట్​ కార్డును లాంచ్​ చేసింది.

 

దీనిని రోజువారీ అవసరాలకు అనుగుణంగా వాడచ్చు. ఈ కార్డు మెట్రో, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసులు, మర్చెంట్​ స్టోర్లలో, టోల్​ పార్కింగ్​ ఛార్జీలు, ఆన్​లైన్​ షాపింగ్​ వంటి వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. అలానే ఏటీఎం నుంచి డబ్బు కూడా విత్​డ్రా చెయ్యచ్చు.

బ్యాంకింగ్​ లావాదేవీలను ఈజీ చెయ్యడానికి ఈ ట్రాన్సిట్​ కార్డును స్టార్ట్ చేసారు. పేటీఎం వ్యాలెట్​తో ఈ ట్రాన్సిట్​ కార్డుతో లింక్ చేసుంటుంది. వినియోగదారులు ఇకపై అన్ని రకాల కార్డ్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్​ తో పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది.

తద్వారా ట్రాన్సిట్​ కార్డుతో నేరుగా మెట్రో ఛార్జీలను చెల్లించవచ్చు. ఈ ‘వన్ నేషన్ వన్ కార్డ్’ నినాదంతోనే కొత్త కార్డును తీసుకొచ్చింది. మెట్రో, బస్సు, రైలు సేవలను క్రమం తప్పకుండా ఉపయోగించే 50 లక్షలకు పైగా రైడర్లకు ఈ ట్రాన్సిట్​ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. పేటీఎం యాప్​ ద్వారా ట్రాన్సిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేటీఎం సేల్స్ పాయింట్ల నుంచి కూడా దీనిని పొందొచ్చు. ఈ కార్డును నేరుగా పేటీఎం వాలెట్‌కి లింక్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version