సునీల్ కోసం డైరెక్టర్ గా మారనున్న యంగ్ హీరో..!

-

లఘు చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్, ఉయ్యాలా జంపాలా సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు. ఉయ్యాలా జంపాలా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. దాంతో ఆ తర్వాత సినిమా చూపిస్త మావా, కుమారి ఎఫ్ సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. ఐతే ఆ తర్వాత రాజ్ తరుణ్ చేసిన చిత్రాలేవీ సరైన ఫలితాన్ని అందివ్వలేదు. ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలకరించాడు.

ఐతే నిజానికి రాజ్ తరుణ్ డైరక్టర్ కావాలని ఇండస్ట్రికి వచ్చాడు. కానీ హీరోగా మారిన తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చేయడంతో అలానే కంటిన్యూ అవుతున్నాడు. ఐతే ప్రస్తుతం డైరెక్టర్ గా మారదామని అనుకుంటున్నాడట. ఆల్రెడీ రెండు స్క్రిప్టుల మీద పనిచేసాడట. అల్లు అర్జున్, సునీల్ ని దృష్టిలో పెట్టుకుని రెండు కథలు రాసుకున్నాడట. సునీల్ తనకి మంచి ఫ్రెండ్ కాబట్టి వచ్చే ఏడాది సునీల్ ని హీరోగా పెట్టి సినిమా తీద్దామని అనుకుంటున్నాడట. హీరోగా సక్సెస్ అయిన రాజ్ తరుణ్ డైరెక్టర్ గా సక్సెస్ అవుతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version