విషాదంలో జూనియర్ ఎన్టీఆర్ : ప్రముఖ నిర్మాత మృతి

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు… మృతి చెందారు. కొందరు కరోనా మూలంగా మరణించగా మరికొంతమంది అనారోగ్యం కారణంగా.. మృతి చెందారు. ఇక తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు మృతి చెందారు. ఇవాళ ఉదయం హటస్మత్తూగా గుండెపోటు రావడంతో… కోనేరు మహేష్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

విశాఖపట్నం లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో మహేష్ మృతి చెందినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పి ఆర్ ఓ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గా మహేష్ కోనేరు వ్యవహరిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు మహేష్. పలు సినిమాలకు మహేష్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి… 118, మిస్ ఇండియా మరియు తిమ్మరుసు లాంటి సినిమాలు చేశాడు మహేష్. అయితే తాజాగా… కోనేరు మహేష్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై చిత్ర పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.