ఇండియన్స్ కు షాక్… తులం బంగారం రూ.1.25 లక్షలు చేరే ఛాన్స్!

-

తులం బంగారం రూ.1.25 లక్షలు చేరే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ ధర 3,300 డాలర్లు ఉండగా.. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.99,700 ఉంది. సుమారు రూ. లక్షకు 10 గ్రాముల బంగారం ధర చేరువకానుంది. కాగా, ఈ ఏడాది చివరికి పసిడి ధర రూ.1.25లక్షలు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

gold

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 97, 320 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 89, 210 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 తగ్గి రూ. 1,09,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news