ఇక నుంచి స్మార్ట్ టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్..!

-

నేటి జనరేషన్ అంతా సోషల్ మీడియా చెరలో బంధీ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాలో. ఇక ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అయితే చూడని వారుండరు. పొద్దున లేచిన దగ్గరి నుంచి నిద్రపోయే వరకు చాలా మంది రొటీన్ ఇన్ స్టా రీల్స్. కేవలం చూడటమే కాదు. రీల్స్ చేయడంపైనా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరూ రీల్స్ చేస్తున్నారు. ఇన్ స్టాలో అప్ లోడ్ చేసి నైట్ నైటే స్టార్ అయిపోతున్నారు. టిక్ టాక్, ఇన్ స్టా చాలా మందిని స్టార్లని చేసింది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి ఉన్న ఈ క్రేజ్ చూసి యూట్యూబ్ కూడా దీనికి దీటుగా ఏదైనా చేయాలనుకుంది. అందుకే వెంటనే యూట్యూబ్ షార్ట్స్ అని షార్ట్ వీడియోస్ అదేనండీ రీల్స్ లా ఓ ఫీచర్ ని తీసుకొచ్చింది.

యూట్యూబ్ ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఇన్ స్టా రీల్స్ లాగే ఈ ఫీచర్ కి కూడా భలే క్రేజ్ వచ్చింది. రోజు కోట్ల మంది యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ఓ వైపు సంపాదిస్తూనే మరోవైపు ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే యూట్యూబ్ ఇంతటితో ఆగలేదు. యూట్యూబ్ షార్ట్స్ కి రోజురోజు పెరుగుతున్న ఆదరణ చూసి దీన్ని మరింత విస్తరించాలనుకుంది. రోజుకి షార్ట్ వీడియోస్ వీక్షణలు 3వేల కోట్లకు చేరుకున్నాయంటే యూట్యూబ్ షార్ట్స్ కి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

యూట్యూబ్ షార్ట్స్ కి వస్తోన్న క్రేజ్ చూసిన యూట్యూబ్ ఓ ఉపాయాన్ని ఆలోచించింది. షార్ట్స్‌ను ఆండ్రాయిడ్‌ టీవీలకూ విస్తరించటంపై యూట్యూబ్‌ దృష్టి సారించింది. యూట్యూబ్‌ టీవీ యాప్‌లో త్వరలో షార్ట్స్‌ను ఆరంభించనుంది. ఒకేసారి నాలుగు ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేలా మొజాయిక్‌ మోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలనీ యూట్యూబ్‌ భావిస్తోంది. దీంతో తెర నాలుగు భాగాలుగా విడిపోతుంది. ఒకో భాగంలో ఒకో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version