తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత సీఎం కేసీఆర్ – బీహార్ సీఎం నితీష్

-

 

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత సీఎం కేసీఆర్ అని బీహార్ సీఎం నితీష్ ప్రశంసించారు. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్‌ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు…మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు..మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండని కోరారు.

మీ భాగస్వామ్యం చాలా గొప్పది…మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడింది….ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదు…అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరు…మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహా నేత అని వెల్లడించారు నితీష్ కుమార్.

ఈ సందర్భంగా… గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం కే చంద్రశేఖర్‌ రావు అందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version