ఆషాడం ఎఫెక్ట్: ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్!

-

ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఏపీలో మళ్లీ మంత్రిపదవులకోసం హడావిడి మొదలైంది. రాజ్యసభకు వెళ్లిన ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన ఆశావహులు రెడీ అయిపోతుంటుండగా.. వారిలో మోపిదేవి గుంటూరు జిల్లా నేత కావడంతో ఆ జిల్లా ఎమ్మెల్యేలు కూడా జిల్లా రిజర్వేషన్ లో భాగంగా రావొచ్చేమో అని ఆశ పడుతుంటుండగా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మరీ ఆశలు పెంచేసుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 22న ఇందుకు సంబందించిన ముహూర్తం ఖారరయ్యే సూచనలు కనిపిస్తున్నాయంట. ఇందులో భాగంగా మోపిదేవి వెంకట రమణ స్థానే గుంటూరు జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన రజనీ ఆశలు పెట్టేసుకోగా… మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వర్గం కూడా ఆశలుపెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సీనియార్టీ బేస్ లో కూడా అదే జిల్లాకు చెందిన అంబటి రాంబాబు, పిన్నెల రామకృష్ణారెడ్డి వర్గం కూడా ఆశలు పెంచేసుకుంటుందని అంటున్నారు.
ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ జిల్లా అయిన తూర్పుగోదావరి నుంచి పెద్దగా ఆశావహులు కనిపిస్తున్నట్లు లేదు! ఇప్పటికే ఈ జిల్లానుంచి కన్నబాబు, పినిపే విశ్వరూప్ మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో జిల్లా రిజర్వేషన్ అప్లై కాకపోవచ్చని అంటున్నారు. ఆయన ఖాళీ చేసింది కేవలం మంత్రి పదవి మాత్రమే కాదు.. ఉపముఖ్యమంత్రి పదవి కూడా కావడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు చాలా ఆశలు పెంచుకుంటున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా… ఈ ఊహలకు, ఆశలకు ఎండ్ కార్డ్ పడేది మాత్రం ఈ నెల 22 అని తెలుస్తుంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది!

Read more RELATED
Recommended to you

Latest news