ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల విషయంలో జగన్ సర్కార్ అవినీతి కీ పాల్పడింది అని ఇట్టివలా ఆరోపించడం జరిగింది. దీనికి విజయసాయిరెడ్డి బిజెపి నాయకులు ఎవరు కూడా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని అన్నారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని జగన్ పై విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా బిజెపి పార్టీ అధ్యక్షుడు పై విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తో ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామం పెద్ద హాట్ టాపిక్ అయింది. మామూలుగా ఏ విషయంలోనైనా బిజెపి కలుగచేసుకుంటే అధికార పార్టీ వైసీపీ చాలా సైలెంట్ గా ఆ విషయంలో వ్యవహరిస్తుందని మనకందరికీ తెలిసినదే. అయితే దానికి భిన్నంగా విజయసాయిరెడ్డి ఇంత దూకుడుగా ధైర్యంగా… ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పై ఘాటైన విమర్శలు చేయటం వెనకాల జగన్ ఉన్నారని వైసీపీ పార్టీలో టాక్. రాష్ట్రంలో జరుగుతున్న పనితీరు అంతా బీజేపీ హైకమాండ్ కు నచ్చటంతో… జగన్ కి మరియు బీజేపీ హైకమాండ్ మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడటంతో వైసిపి నాయకులకు ప్రత్యర్థులపై ఫుల్ పవర్స్ ఇచ్చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.