రాష్ట్రంలోనే కాదు ఇది దేశంలోనే సంచలన న్యూస్. కేవలం అంబానీలు అంటే సౌత్ లో ఎక్కువగా అందులో తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబుతో మాత్రమే సన్నిహితంగా ఉంటారు చాలామంది అంటారు. కానీ దానికి విరుద్ధంగా మొన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుని ఆయనతో ఏకాంతంగా గంట సేపు భేటీ కావడం అందరికీ మతిపోయింది. ముఖ్యంగా టీడీపీకి మరియు చంద్రబాబుని సపోర్ట్ చేసి ఎల్లో మీడియా కి. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న రిలయన్స్ పెట్టుబడులు మొత్తం తరలిపోయాయి అనే కామెంట్లు చేసినా తెలుగుదేశం పార్టీ నేతలకు వీరిద్దరి సమావేశం కరెంట్ షాక్ ఇచ్చినట్లు అయ్యింది.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన వీరిద్దరి సమావేశం లో దాదాపు కొన్ని వేల కోట్లు రిలయన్స్ పెట్టుబడుల రూపంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి రెడీ అయిందట, దీంతో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే ఎల్లో మీడియా కేవలం అంబానీలు అంటే చంద్రబాబుతో మాత్రమే సన్నిహితంగా ఉంటారు ఆయన విజన్ ఉండే నాయకుడు జగన్ లాంటి వాళ్లు వస్తే రాష్ట్రంలోని అడుగు పెట్టారు మరియు పెట్టుబడులు కూడా పెట్టారు అంటూ తెగ కథనాలు ప్రసారం చేసింది.
ఇటువంటి తరుణంలో జగన్ తన రాజకీయ వ్యూహాలతో కేంద్ర స్థాయిలో పొలిటికల్ గా రింగు తిప్పి ముకేశ్ అంబానీ తన ఇంటికి వచ్చేటట్టు చేయించుకుని…చంద్రబాబు స్థాయి జగన్ ది కాదు అన్నట్టు చిత్రీకరించిన ఎల్లో మీడియా కి సునామీ పవర్ చూపించాడు జగన్. కనీసం ఇప్పటి వరకు చంద్రబాబు గడప తొక్కని ముకేశ్ అంబానీ జగన్ ఇంటికి వెళ్లి స్వయంగా గంటసేపు మాట్లాడటంతో రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు సైతం జగన్ పొలిటికల్ ప్లాన్ లకు ఫిదా అవుతున్నారు.