వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మరియు రీజనల్ కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా, వైఎస్ జగన్ రాబోయే రాజకీయ పరిస్థితులపై నేతలకు మార్గదర్శనం చేయనున్నట్లు సమాచారం. పార్టీ తీసుకునే దిశ, అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు, కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులంతా పటిష్టంగా ఉండేలా ఈ సమావేశం కీలకంగా మారనుంది.