కొత్త పథకానికి సర్వే స్టార్ట్ అయ్యింది.. వాలంటీర్లను సంప్రదించండి!

-

వైఎస్ జగన్ ఏపీ సీఎం అయినప్పటినుంచీ వరుసగా అమలవుతున్న నవరత్నాల సంగతి తెలిసిందే. వీటిని జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సంగతీ తెలిసిందే. అందులో భాగంగా తొలి ఏడాది మొత్తం సంక్షేమ పథకాలపైనే దృష్టిసారించాలని భావించి ఆ దిశగా జగన్ ముందుకు వెళ్లారు. కరోనా రూపంలో కష్టం వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గతంలోనే ప్రకటించిన కొత్త పథకానికి సంబందించి తేదీలు వెలువడ్డాయి.

చిరువ్యాపారులు, వీధివ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా రూపొందించిన “జగనన్న తోడు” పథకాన్ని ప్రభుత్వం అక్టోబరులో ప్రకటించనుంది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ఎంతో చేదోడు ఇచ్చినట్లుంటుందని భావించిన జగన్ సర్కార్.. ఈ దిశగా ఈ పథకానికి “జగనన్న తోడు” అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారికి, సంప్రదాయ వృత్తులు చేసే హస్తకళాకారులకు ఈ పథకం కింద రూ.10వేల వరకూ వడ్డీలేని రుణాన్ని ఇస్తారు. ఈ క్రమంలో అర్హుల గుర్తింపుకోసం గ్రామ వాలంటీర్లు ఈ నెల 6 నుంచి 16వరకూ సర్వే నిర్వహిస్తారు. అనంతరం జూలై 16 – 23వరకూ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news