యాత్ర ముగింపు రోజున విజయసంకల్పం..

-

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజున ఇచ్ఛాపురంలోని బహుదా నదీ తీరంలో ‘విజయ సంకల్ప స్థూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 341 రోజుల పాటు నాకు తోడుగా ఉంటూ ఆదరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను అని తెలిపారు. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడిచింది తానైనా.. నడిపించింది మాత్రం ప్రజలేనని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు హయాంలో దగాపడ్డ రైతన్నా.. మోసపోయిన డ్వాక్రా అక్కా చెళ్లెమ్మలు.. ఉద్యోగం రాక నిరాశలో ఉన్న యువతను పాదయాత్రలో కలిసానని, వారి గోడును విన్నానని తెలిపారు.

‘ఇడుపులపాయలో తొలి అడుగువేసినప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని, ఇన్ని కోట్ల మంది ప్రజాభిమానం లభిస్తుందని ఊహించలేదు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరూ అంటూ అశేష జనవాహినిన ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర విభజన నష్టం ఒక వైపు.. చంద్రబాబు దోపిడీ మరోవైపు. రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం ఒక వంకా.. నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు నైజం మరోవంక. హెరిటేజ్‌ కోసం చంద్రబాబు దళారీ వ్యవస్థకు కెప్టెన్‌ అయ్యాడు. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదు. ఉద్దానం, పలాసలో జీడిపప్పు చాలా ఫేమస్‌.  ఈ జీడిపప్పును ఇక్కడి రైతులు కేజీ రూ.600కు అమ్ముకోలేని పరిస్థితి. కానీ చంద్రబాబు హెరిటేజ్‌లో కేజీ రూ.1100లకు అమ్ముతున్నారు అంటూ బాబుపై విమర్శనాస్త్రాలను విసిరారు.

జగన్ చేసిన  కొన్ని వాగ్దానాలు..

ప్రతీ పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా మారుస్తాం.

గ్రామంలోని చదువుకున్న యువతకు అదే గ్రామంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తాను.

నవరత్నాల్లో అన్ని ప్రతి అంశం ప్రజలకు చేరువయ్యే విధంగా అందిస్తాం.

కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అందరికి నవరత్నాలను అందిస్తాం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version