ఆంధ్రప్రదేశ్ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ రానున్నారు. హైదరాబాదులో ఆయన ఈరోజు రెండు వివాహానికి హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. శంషాబాద్ లో జరిగే జీవీకే రంగరాజు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. అలాగే నార్సింగ్ లో జరిగే జర్నలిస్ట్ వర్ధన్న మురళి కుమారుడి పెళ్లికి కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ రెండు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని జగన్ తిరిగి అమరావతి బయలుదేరి వెళతారు.
ఇక ఈరోజు వైఎస్ జగన్ నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చిరు వ్యాపారులకు పదివేల వడ్డీ లేని రుణాన్ని నేడు జగన్ అందజేయనున్నారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. దీంతో వారి ఆదాయం సగం వడ్డీలు చెల్లించడానికి సరిపోతుంది. దీంతో ఒక్కొక్కరికి పదివేల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందచేయనున్నారు. మొత్తం 9.05 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.