ట్విట్టర్ వేదికగా సవాల్ చేసిన వైసీపీ అధినేత
వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా లేఖ రూపంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గనుల దోపిడీ కేసుని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. తన చేతిలో దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించి అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా లేఖలోని కొన్ని విషయాలను పరిశీలించినట్లైతే..
పల్నాడు గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు చంద్రబాబుగారు సిద్ధమా? pic.twitter.com/vsNveKwePX
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2018
శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేసినట్లు తేలుతోంది, వేల లారీల ద్వారా ఖనిజాన్ని ప్రతీరోజూ తరలించేవారన్నారు. ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ అందూ ఈ దోపిడీల్లో భాగస్వాములే. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిన ఆడియో, వీడియో టేపుల్లోని చంద్రబాబు మాటలను ఆయన లేఖలో గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతో గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా జరిగితేనే ఎవరెవ్వరి షేర్లు ఎంతో అప్పుడు బయటకొస్తాయన్నారు.
240వ రోజుకు చేరిన పాదయాత్ర
విశాఖ జిల్లాలో 240వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా ట్వీట్ చేశారు. పెద్దబొడ్డేపల్లి నుంచి నేడు పాదయాత్రను ప్రారంభించారు. సుబ్బారాయుడుపాలెం, చంద్రయ్యపాలెం, తమ్మయ్యపాలెం, జోగివానిపాలెం క్రాస్ రోడ్డు మీదుగా ధర్మసాగరం వరకు నేడు పాదయాత్ర కొనసాగనుంది.