నిన్న ఎనుమాల మార్కెట్ యార్డులో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే.. వివాదంపై కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగా వైఎస్ షర్మిల.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల.
అవమానంతో సీఎం కేసీఆర్ తలదించుకోవాలని…చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని_ముఖ్యమంత్రి_మనకొద్దంటూ నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. ఇక నైనా కేసీఆర్ సర్కార్ బుద్ది తెచ్చుకోవాలని హెచ్చరించారు.