రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇక్కడ నియంత పాలన జరుగుతుందని, ఉత్తి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడంటూ సెటైర్లు వేశారు. మంత్రి అయ్యాక… ఆ పదవికి విలువ లేదు..హోదా తెలియదు..హుందా కూడా తెలియదంటూ ఆమె మండిపడ్డారు. పువ్వాడ కు ఎన్ని ఆస్తులు సంపాదించినా…ఎన్ని కబ్జాలు చేసినా…దనదాహం మాత్రం తీరదంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు ..ప్రైవేట్ ఆస్తులు అన్ని కబ్జా చేస్తాడని, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనేది పువ్వాడ కు సరిపోతుందంటూ ఆమె ధ్వజమెత్తారు. ఒకప్పుడు ఇల్లు లేని పువ్వాడకు హైదరాబాద్ శామీర్ పేట లో 80 ఎకరాల భూమి ఎలా వచ్చిందని, ఖమ్మంలో ఏ కాంట్రాక్ట్ చేసినా ఇతనే చేయాలని, ఆయన భార్య కంపెనీ..లేదా బినామీ కంపెనీ లే చేయాలన్నారు.
ఈయన ట్రాన్స్ పోర్ట్ మంత్రి.. ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల బ్రతులను రోడ్ల పాలు చేశారని, కనీసం యూనియన్స్ లేకుండా చేశారని ఆమె మండిపడ్డారు. పువ్వాడ అజయ్ కున్న పేరు…గుండా…రౌడీ షీటర్… దొంగ..ఒక బ్లాక్ మెయిలర్ అని ఆమె దుయ్యబట్టారు. ఇంతకు మించి పువ్వాడ సాధించింది ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ లెక్కనే ఆయన మంత్రులు.. పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు ఉంది కేసీఆర్ అండ్ కో పరిస్థితి అంటూ ఆమె చురకలు అంటించారు. దోచుకోవడం దాచుకోవడం తప్పా కేసీఆర్ కు ఎం చేతనయ్యిందంటూ ఆమె మండిపడ్డారు.