Sai Pallavi:వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన సాయిపల్లవి..

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గో రక్షకుల గురించి, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటూ కొందరు తప్పుబడుతున్నారు. ఈ విషయమై హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు కంప్లయింట్ చేశారు. పోలీసులు హీరోయిన్ సాయిపల్లవి పై కేసు నమోదు చేసి వీడియో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సాయిపల్లవిపై కొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా, ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో ఈ వివాదంపై సాయిపల్లవి స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలకు డెఫినెట్ గా సమాధానం చెప్తానని, కానీ, అందుకు సమయం ఇది కాదని స్పష్టం చేసింది.

తనను వివాదం నుంచి బయటకు తీసుకురావాలని అభిమానులు చూస్తున్నారని తను తెలుసని, అయితే, తనకు ప్రస్తుతం ‘విరాట పర్వం’ సినిమానే ముఖ్యమని తెలిపింది. పిక్చర్ రిలీజ్ అవుతున్న క్రమంలో తాను హ్యాపీగా ఉన్నానని , ఫిల్మ్ విడుదల తర్వాత తాను వివాదం గురించి మాట్లాడతానని స్పష్టం చేసింది. రానా ఈ విషయమై మాట్లాడుతూ తాను లేని టైంలో సాయిపల్లవితో మాట్లాడించారని, తాను ఉండి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని అన్నాడు. వివాదాల గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదని వివరించాడు. ‘విరాట పర్వం’ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version