రాష్ట్రంలో వరుస పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. SSC పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే.. కానీ SSC పేపర్ లీక్ దర్యాప్తు మీద పెట్టిన శ్రద్ధ.. TSPSC పేపర్ లీక్ మీద ఎందుకు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు.
” BRS పెద్ద తలకాయలు బయటపడుతాయనా? “బంది పోట్ల రాష్ట్ర సమితి” నేతల కండ్లకు, చెవులకు 30 లక్షల మంది నిరుద్యోగుల కన్నీటి రోదన కనపడడం, వినపడటం లేదా? SSC పేపర్ బయటకు వచ్చేంతగా తలుపులు తెరిచారు అంటే మీది దిక్కుమాలిన పాలన కాదా? పేపర్ బయటికి రాగానే ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసి, బలి చేసిన మీరు.. TSPSC ఉద్యోగులు, బోర్డు సభ్యులు, చైర్మన్ ను వెంటనే ఎందుకు తొలగించలేదు? ఇందులో BRS బడా నేతల హస్తం ఉందనా? లేక వాళ్లంతా మీ తొత్తులనా?
SSC పేపర్ లీకుల్లో స్వయానా ప్రతిపక్ష నేత హస్తం ఉందని తేల్చిన నీ పోలీస్ వ్యవస్థ.. TSPSC లీకుల స్కాం లో దాగి ఉన్న నీ ఇంటి దొంగలను బయట పెట్టకపోతే..రానున్న ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి నిరుద్యోగులు ఘోరి కట్టడం తథ్యం” అని హేచ్చరించారు.