తెలంగాణ కోసం పొరాడినట్టే..కేసీఆర్ పై అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలి – షర్మిల

-

తెలంగాణ కోసం పొరాడినట్టే..కేసీఆర్ పై అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలన్నారు షర్మిల. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా ఏకమైన పార్టీలు.. నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడినది. 1200మంది ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతున్నది. బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని తేల్చి చెబితే, KCR మాత్రం 80వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారన్నారు.

అవి కూడా భర్తీ చేయడానికి చేతకవడం లేదు. ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో తెలియని పరిస్థితి.TSPSC నేడు అది ప్రశ్నాపత్రాలు అమ్మే సంస్థగా తేలింది. 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను బలి చేస్తూ.. ఉద్యోగాలను సంతలో సరుకుల్లా అమ్ముకొంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సిన సర్కారు.. తప్పు నాది కాదు అని మన్ను తిన్న పాము లాగా తప్పించుకుంటున్నది. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం ఉన్నది. సర్కారుపై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నం అయినది. కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ జన సమితి, BSP, TDP, జనసేన,MIM, CPI, CPM, MRPSతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు మాతో కలిసి రావాలని YSR తెలంగాణ పార్టీ అభ్యర్థిస్తున్నది. అందరం పార్టీలకు అతీతంగా నిరుద్యోగుల పక్షాన పోరాడుదామని పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version