వైఎస్ వివేక హత్య కేసు.. తులసమ్మ వాంగ్మూలం రికార్డ్ చేసిన కోర్ట్

-

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, కేసు విచారణలో సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ తులసమ్మ కోర్టులో పిటిషన్ వేశారు.

వివేక హత్య కేసులో సిబిఐ చేస్తున్న విచారణ తీరుపై పులివెందులలో ఫిబ్రవరిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దేవిరెడ్డి శంకర రెడ్డి భార్య తులసమ్మ. ఈ నేపథ్యంలో నేడు పులివెందుల కోర్టులో వివేక పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ నమోదు. ఈ సందర్భంగా దేవి రెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ న్యాయవాది కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..

“వివేకానంద రెడ్డి రెండవ వివాహం చేసుకున్నారు. ఆయన రెండవ భార్య షమీం కు ఒక కుమారుడు ఉన్నారు. వారికి ఆస్తి పోతుందని వివేకానంద రెడ్డితో ఆయన కుటుంబ సభ్యులు గొడవపడేవారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వివేకతో గొడవ పడేవారు. హత్యానంతరం అక్కడ లభించినవంటి లేఖను ఆయన మొబైల్ ను పోలీసులకు ఇవ్వకుండా అడ్డుకున్నారని కోర్టులో పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు ” అని తెలిపారు కోదండరామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news