ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో.. ఏపీ సర్కార్ వైఎస్సార్ అర్భన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. పట్టణ ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలనను శరవేగంగా నిర్మిస్తోంది.

ప్రతి 2 కి. మీ ఒక ఆరోగ్యం కేంద్రం ఉండేలా ప్రణాళిక రూపొందించి…. ఆ దిశగా భవనాలు సమకూర్చే పనులు చేపడుతోంది. ఈ పనులు త్వరలోనే పూర్తి అయి… మే నెల చివరి నాటికి వైఎస్సార్ అర్భన్ హెల్త్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని.. అధికారులు చెబుతున్నారు.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్ పట్టణ ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలి ప్రాధాన్యంగా వీటి ప్రాధాన్యంగా వీటి నిర్మాణం… భవనాలకేటాయింపుపై ఆయన ఆరా తీస్తున్నారు. సాధమైనంత త్వరగా భవనాలు కేటాయింపు పూర్తి చేసి.. పట్టణ ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు.