టీడీపీ కంచుకోటలో వైసీపీ బిగ్ మిస్టేక్?

-

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలనే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లాన్ ప్రకారం రాజకీయం నడిపిస్తూ..మళ్ళీ పార్టీని విజయం దిశగా నడిపిస్తున్నారు. ఓ వైపు పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ..పార్టీని బలోపేతం చేస్తూ..మరోవైపు జనాల్లో ఉంటున్నారు. ఇక ప్రతి స్థానంలో పార్టీ సత్తా చాటేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అవసరమైతే కీలక మార్పులు చేయడానికి కూడా జగన్ రెడీ అవుతున్నారు.

పార్టీ కోసం కొందరికి సీట్లు ఇవ్వకూడదని చూస్తున్నారు..అలాగే కొందరి సీట్లు మార్చే ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా రెండు స్థానాల్లో మార్పులు చేశారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. దీని బట్టి ఆనంకు చెక్ పెట్టినట్లు అయింది. అటు పర్చూరుకు ఇంచార్జ్ గా ఆమంచి కృష్ణ మోహన్‌ని నియమించారు. అయితే ఆమంచి సొంత స్థానం చీరాల. ఆ సీటు కోసం గట్టిగానే ట్రై చేశారు. కానీ అక్కడ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కరణం బలరామ్ ఉన్నారు.

చాలా రోజుల పాటు కరణం, ఆమంచిల మధ్య కోల్డ్ వార్ నడిచింది. కానీ తాజాగా ఆమంచిని పర్చూరుకు పంపడంతో..చీరాలలో కరణంకు లైన్ క్లియర్ అయింది. అయితే ఇంతకాలం పర్చూరు ఇంచార్జ్ గా పనిచేసిన రావి రామనాథంబాబుకు హ్యాండ్ ఇచ్చినట్లు అయింది. అయితే టీడీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న పర్చూరుని కైవసం చేసుకోవడానికి జగన్..ఆమంచిని అక్కడకు ఇంచార్జ్ గా పెట్టారు. పైగా కాపు వర్గం నాయకుడు కావడంతో..పర్చూరులో కాపులు కలిసొస్తారని భావిస్తున్నారు.

కానీ ఇదే జగన్ మిస్టేక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పర్చూరులో టీడీపీ ఎమ్మెలే ఏలూరి సాంబశివరావు స్ట్రాంగ్ గా ఉన్నారు..పైగా కమ్మ వర్గం నేత..కమ్మ వర్గం సపోర్ట్ ఉంటుంది..అటు కాపుల్లో పట్టు ఉంది. ఇదే సమయంలో నెక్స్ట్ జనసేనతో పొత్తు ఉంటే కాపు వర్గం ఏలూరికి కలిసొస్తుంది. పైగా వైసీపీలో కమ్మ వర్గం నేత రావిని తప్పించడం వల్ల..ఇప్పటివరకు వైసీపీకి సపోర్ట్ ఉన్న కొంత కమ్మ వర్గం సైతం ఏలూరి వైపు వెళ్ళే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అంటే ఎటు చూసిన చీరాల కాదని ఆమంచిని పర్చూరులో పెట్టడం బిగ్ మిస్టేక్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version