రాజ‌ధానిలో వైసీపీ ఎమ్మెల్యే చందాలు… దందాలు…?

-

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌మ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ కూడా అవినీతి ఉచ్చులో చిక్కుకున్నా… ఎవ‌రిపై అయినా అవినీతి వార్త‌లు వ‌చ్చినా స‌హించ‌న‌ని ఇప్ప‌టికే సీరియ‌స్‌గా వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. రెండు మంత్రి వ‌ర్గ స‌మావేశాల్లో మంత్రులు అంద‌రిని హెచ్చ‌రించిన జ‌గ‌న్.. ఏ మంత్రి అయినా చేయి చాపిన‌ట్టు త‌న దృష్టికి వ‌స్తే వెంట‌నే వాళ్ల‌ను పిలిచి మ‌రీ క్లాస్ పీకుతున్నారు. ఓ మ‌హిళా మంత్రితో పాటు మ‌రో ముగ్గురు మంత్రుల‌కు జ‌గ‌న్ ఈ త‌ర‌హా వార్నింగ్‌లు ఇచ్చిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్నింగ్‌ల‌తో చివ‌ర‌కు ఎమ్మెల్యేలు సైతం ఎవ‌రి ద‌గ్గ‌ర అయినా ప‌నులు, కాంట్రాక్టుల కోసం చేయి చాపాలంటేనే భ‌య‌ప‌డుతోన్న ప‌రిస్థితి. జ‌గ‌న్ ఇంత స్ట్రిక్ట్‌గా వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నా.. మ‌రోవైపు ఇంటిలిజెన్స్ డేగ‌లా వెంటాడుతున్నా కొంద‌రు మంత్రులు, కొంద‌రు ఎమ్మెల్యేలు ఈ దందా కొన‌సాగిస్తూనే ఉన్నారు. తాజాగా రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే ఒక‌రు రాజ‌ధాని ఏరియాలో రియ‌ల్ ఎస్టేట్ &  హౌసింగ్‌లో పెద్ద సంస్థ‌లుగా ఉన్న రెండు సంస్థ‌ల‌ను బెదిరించి రు.10 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసిన‌ట్టు అక్క‌డ మ్యాట‌ర్ బ‌య‌ట‌కు పొక్కింది.

స‌ద‌రు ఎమ్మెల్యే సీనియ‌ర్‌.. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా అధికార టీడీపీపై పోరాటాలు చేశాడు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి చెందిన ఓ యువ‌నేత‌ను ఓడించి జెయింట్ కిల్ల‌ర్ అయ్యాడు. ఇప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌మీపంలోనే ఉన్న రెండు బ‌డా నిర్మాణ కంపెనీల‌ను బెదిరించి మ‌రీ చెరో రు.5 కోట్ల వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. అస‌లు ఈ ఎన్నిక‌లకు ముందు స‌ద‌రు నేత పోటీ చేస్తారా ?  లేదా ? అన్న డౌట్ కూడా వ‌చ్చింది.

అయితే పార్టీ నేత ఆర్థిక స‌హ‌కారం చేయ‌డంతో పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న రియ‌ల్ వ్యాపారులు చందాలు కూడా ఇచ్చారు. అయినా స‌ద‌రు ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ చందా దందాకు తెర‌లేపిన‌ట్టు టాక్‌.. ?  ఈ వ్య‌వ‌హారం ఇప్ప‌టికే అధికార పార్టీ వ‌ర్గాల్లో బాగా స్ప్రెడ్ అవుతోంది. మ‌రి ఇది జ‌గ‌న్ దృష్టికి వెళ్లిందా ?  లేదా ? అన్న‌ది మాత్రం తెలియ‌దు కాని.. పార్టీ గెలిచాక స‌ద‌రు ఎమ్మెల్యే బెదిరింపులు మ‌రీ ఎక్కువైన‌ట్టు స్థానికంగా బ‌డా రియ‌ల్ సంస్థ‌ల నేత‌లు చెపుతున్న‌ట్టు భోగ‌ట్టా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version