వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా షర్మిళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. రైతులు చనిపోతున్నా… కేసీఆర్ మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించింది.
వైఎస్ షర్మిళ ట్విటర్ లో దొరా.. మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారనే ఆశ లేక, పత్తికి మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నా… దున్నపోతు మీద వాన పడ్డట్టు కేసీఆర్ గారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించింది. రైతులకు భరోసా కల్పించేందుకు దొర గారు కాలు బయటపెట్టింది లేదు. అయ్యా దొర గారు, పంజాబ్ రైతుల చావులు మీకు కనపడ్డాయి కానీ రాష్ట్రంలో రైతుల చావులు కనపడటం లేదా? రైతుల చావులను ఆపడం చేతకాని సీఎం మనకొద్దు అంటూ.. వ్యాఖ్యానించింది.